బ్రెడ్ 65 ఎలా చేయాలో తెలుసా..?

గురువారం, 27 డిశెంబరు 2018 (11:03 IST)
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ - 4 స్లైసులు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
క్యారెట్ తురుము - కొంచెం
క్యాప్సికం - తగినంత
పెరుగు - 1 కప్పు
వెల్లుల్లి - 4 రెబ్బలు
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ స్లైసెస్‍ను నీళ్ళల్లో వేసి వెంటనే పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్ తురుము, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడిచేసి ఈ ఉండలు వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో స్పూన్ నూనె వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తరువాత బ్రెడ్ ఉండలు వేసి చిటికెడు ఉప్పు, కారం వేయాలి. ఇప్పుడు పెరుగును కొంచెం బీట్ చేసి ఇందులో వేసి సన్నని సెగపై అంతా ఇగిరిపోయి పొడిపొడిగా అయ్యేవరకూ వేయించాలి. ఒక బౌల్‌‍లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి తీసుకుంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ 65 రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు