ఫెంగ్‌షుయ్‌ టిప్స్‌తో బరువు తగ్గొచ్చా..?

FILE
అవును. ఫెంగ్‌షుయ్ టిప్స్‌తో బరువు తగ్గొచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ముందుగా బరువు తగ్గాలంటే మీ వంట గదిని ఫెంగ్‌షుయ్ ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. వంటగది చిందరవందరగా లేకుండా కిచెన్ చూస్తేనే అదిరిపోయేలా ఉండాలి.

కిచెన్‌లో ఎప్పుడూ తాజాదనం, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. మిగిలి పోయిన పదార్థాలు వంటగదిలో ఉండకూడదు. వాటిని తినకపోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు.

ఇక రంగుల విషయానికి వస్తే.. వంటగదికి ఫెంగ్‌షుయ్ రంగులైన ఎరుపు, ఆరెంజ్, పర్‌పుల్, బ్రైట్ ఎల్లో, బ్లూ, గ్రీన్‌లను ఎంచుకోవచ్చు. వంటగదిలో నీళ్లు కనబడేలా వాటర్ బాటిల్స్‌లో ఉంచండి. ఆకుకూరలు, కాయగూరలు ఎప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోండి.

ముఖ్యంగా వెలుతురు, తాజాదనం కిచెన్‌లో ఉంటే బరువు తగ్గడం చాలా సులభమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి