ఫెంగ్‌షుయ్ ప్రకారం డ్రెస్సింగ్ టేబుల్ అమరిక

గురువారం, 7 ఆగస్టు 2008 (19:35 IST)
ఫెంగ్‌షుయ్ మన జీవితంలో ప్రతి అంశాన్నిసృశించగలదు. ఆఖరికి మనం వాడుకునే డ్రస్సింగ్, టేబుల్‌ని సైతం ఫెంగ్‌షుయ్ సూత్రాల ప్రకారం మార్చుకోవచ్చునని చెబుతోంది. ముందుగా మీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వెలుగు ధారాళంగా ఉండేటట్లు చూసుకోవాలని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

డ్రెస్సింగ్ గదిలో లైట్‌ ద్వారా ప్రకాశవంతమైన వెలుగు ప్రసరిస్తూ ఉండాలని ఫెంగ్ షుయ్ అంటోంది. దానివల్ల మనకు కావాల్సిన వెలుగు లభించడమే కాకుండా ఫెంగ్ షుయ్ ప్రకారం శుభఫలితాల నిస్తుందని నిపుణుల వాదన.

ఇకపోతే మీ డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడూ మీరు పడుకునే మంచం ఎదురుగా అద్దం ద్వారా కన్పించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండని ఫెంగ్ షుయ్ వెల్లడిస్తోంది. పడక మంచానికి ఎదురుగా అద్దం ఉన్నట్లైతే అది మీరు నిద్రపోతున్నప్పుడు చెడు శక్తిని సృష్టిస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. అందుచేత డ్రస్సింగ్ టేబుల్‌ను బెడ్‌కు కుడి, ఎడమ వైపులా అమర్చుకోవడం శ్రేయస్కరమని ఆ శాస్త్రం వెల్లడిస్తోంది.

వెబ్దునియా పై చదవండి