పగడ ఆంజనేయుని పూజించడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. పగడపు ఆంజనేయుడిని పూజిస్తుంటే ఇంట్లో వున్న ప్రతికూల శక్తులు తొలగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఈ పగడ హనుమంతుని ఆలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పట్టణాలలోనూ దర్శనమిస్తుంటాయి. హనుమంతుడిని ఆంజనేయాయ విద్మహే, వాయుపుత్రాయ ధీమహీ, తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అని ప్రార్థిస్తే ఆరోగ్యం, ధైర్యం కలుగుతాయి