ఫెంగ్‌షుయ్ : మీ ఇంటి ఎంట్రెన్స్ ఎప్పుడూ అద్దిరిపోవాలి!!
శుక్రవారం, 3 జనవరి 2014 (18:57 IST)
FILE
ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంటికి ప్రధాన ద్వారం ఎప్పుడూ అద్దిరిపోవాలి. ఎంట్రెన్స్ చూడముచ్చటగా ఉంటేనే చి ప్రవాహాన్ని గృహంలోకి ఆహ్వానించినట్లవుతుందని నిపుణులు అంటున్నారు.
ఎంట్రన్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎంట్రెన్స్‌లో ఎప్పుడు తేలికపాటి సంగీతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడూ డోర్ మ్యాట్‌లు ఫ్రెష్‌గా ఉండేలా చూసుకోవాలి.
రంగు రంగుల పూల తొట్టెలను ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉంచవచ్చు. మీకు నచ్చిన రంగులతో డోర్‌లను అలంకరించుకోవచ్చు. డల్‌గా ఉండే బల్బును తొలగించి రంగుల రంగుల మంచి వెలుగునిచ్చే బల్బులను అమర్చుకోవచ్చు.
ఇలాంటి చిట్కాలను పాటిస్తే తప్పకుండా మీ ఇంటి ఎంట్రెన్స్ అదుర్స్ అని మీ ఇరుగుపొరుగు వారు మెచ్చుకోవడం ఖాయమని, దీనికి తోడు ఎంట్రెన్స్ శుభ్రంతో పాటు ఫెంగ్‌షుయ్ ప్రకారం ఏర్పాటు చేసుకుంటే ఇంటి యజమానికి సానుకూల ఫలితాలుంటాయి.