ఫెంగ్‌ షుయ్ ప్రకారం రంగుల ప్రాధాన్యత

బుధవారం, 20 ఆగస్టు 2008 (19:56 IST)
మనకు మంచిని చేకూర్చడంలో, దోషాలను తొలగించడంలో రంగులు చాలా ఉపయోగపడుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. రంగుల వాడకం వల్ల మంచి చెడ్డల ఫలితాలు కలుగుతాయని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. సోమవారాల్లో ఏదైనా పార్టీలకు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లునప్పుడు తెల్లని, నీలిరంగు, కొద్దిగా వెండిచాయ రంగు కలిగిన దుస్తులను ధరించినట్లైతే మంచి ఫలితాలను చేకురుస్తుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది.

ఇలాంటి రంగుల దుస్తులను ధరించినట్లైతే ఫంక్షన్‌లో ఎప్పుడూ మీమ్ములను లెక్కచేయని వారుకూడా మిమ్మల్ని గుర్తిస్తారని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. అలాగే మంగళవారాల్లో ఎర్రని, నారింజరంగులకు సన్నిహితంగా ఉన్న దుస్తులను ధరించినట్లైతే మంచి ఫలితాలను గ్రహించవచ్చని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

బుధవారాల్లో ఆకుపచ్చరంగు మంచిదని, గురువారాల్లో పసుపుపచ్చ రంగు శ్రేష్టమని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. శుక్రవారాల్లో పింక్, క్రిమ్ లేదా లైట్ క్రిమ్ రంగులు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయని, శనివారాల్లో నేవీబ్లు, నలుపు రంగులకు సమీపరంగు దుస్తులను వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. ఆదివారాల్లో నారింజ, బంగారు రంగుల దుస్తులు వేసుకున్నట్లైతే శుభ ఫలితాలను ఇస్తుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.

వెబ్దునియా పై చదవండి