ఫెంగ్ షుయ్ ప్రకారం చెట్ల పెంపకం

శనివారం, 9 ఆగస్టు 2008 (19:08 IST)
గృహం ముందు స్థలం ఎక్కువగా ఉన్నట్లైతే చెట్లను పెంచడం మంచిదని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది. నైరుతి దిశ, ఆగ్నేయ దిశలో పెద్ద చెట్లు ఉండడం ఉత్తమమని, ఈశాన్యదిశలో వృక్షాలను పెంచడం ఇంటి యజమానికి హానికరమని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది.

ఈ దిశలలో చెట్లు ఇళ్లకు కాస్త దూరంలో ఉన్నా ఫలితాలు వర్తిస్తాయని ఫెంగ్ షుయ్ చెబుతోంది. ఏ దిశలో చెట్లున్నా దానివైపుగా మీ గృహంలో ఉన్న కిటికీలో ఓ చిన్న అద్దం పెట్టినట్లైతే శుభఫలితాలను కలిగిస్తుందని ఫెంగ్ షుయ్ తెలుపుతోంది.

ఇంటి ముందు విశాలమైన పూల తోట. ఇంటి చుట్టూ గుబురుగా పెరిగిన చెట్లు విజ్ఞానం ప్రకారం ఆక్సిజన్‌ను అందించడం ద్వారా "ఛీ" ప్రవాహం ఇంటి యందు ప్రవేశిస్తుందని, దీని ద్వారా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయని ఫెంగ్‌షుయ్ అంటోంది.

వెబ్దునియా పై చదవండి