ఫెంగ్ షుయ్ ప్రకారం మెట్ల అమరిక!

శనివారం, 6 సెప్టెంబరు 2008 (18:42 IST)
మెట్లను క్రమ పద్ధతిలో నిర్మించడం వల్ల రెండు రకాలుగా లాభం ఉంటుందని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది. సాధారణంగా ఇండ్లలో కొద్దిగా వంపు తిరిగిన మెట్లు ఉండడం ఎంతో లాభదాయకమని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. మెలికలు తిరిగిన విధంగా నిర్మించుకున్నట్లైతే "చి" శక్తి మరీ ఉదృతంగా కాకుండా మరీ నెమ్మదిగా కాకుండా ఒక సక్రమైన పద్ధతిలో కావాల్సినంత రీతిలో అందుతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. దీనిద్వారా పై అంతస్తులోని వారు, కింది అంతస్తులోనివారు అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది.

ప్రధాన ద్వారం ఎదురుగానే, లేదా హాలులో ప్రవేశించగానే మెట్లు ఉండరాదని చెబుతోంది. ఇలా నిర్మించడం వల్ల ఇంట్లోకి ప్రవేశించే "చి" శక్తి కింది హాలులోకి వెళ్ళకుండా మెట్లపైకి పోతుందని ఫెంగ్‌షుయ్ తెలుపుతోంది. దీనివల్ల హాలులోనకాకుండా మిగిలిన గదులకు కూడా తగిన"'ి" శక్తి లభ్యం కాదని, ఇలా నిర్మించుకోవడం అన్ని విధాలుగా మంచిది కాదని ఫెంగ్‌షుయ్ పేర్కొంటోంది.

వెబ్దునియా పై చదవండి