మాంసాహారాన్ని ఎక్కువగా తినొద్దు!

శుక్రవారం, 19 సెప్టెంబరు 2008 (16:21 IST)
మాంసాహారాన్ని రుచిగా ఉందని కొందరు భోజన ప్రియులు తెగ లాగించేస్తుంటారు. ఇలాంటి వారిని ఫెంగ్‌షుయ్ హెచ్చరిస్తోంది. రుచిగా ఉందని ఎక్కువగా తినేయకండి... అలా తినడానికి కూడా ఒక ఫెంగ్‌షుయ్ పద్ధతి ఉందని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు. మీరు తినగలిగే మోతాదులో కేవలం నలభైశాతం మాత్రమే తినాలని, కనీసం 20 శాతం మోతాదు కూరగాయలు తప్పనిసరిగా తినాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

మిగిలిన 20 శాతం మజ్జిగ వంటి ద్రవరూప ఆహారాన్ని తీసుకోవాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఇకపోతే దాదాపు 15 నుంచి 20 వరకు ఖాళీ కడుపుతో ఉండడం మాంసాహారం భుజించే వారికి తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే... భుజించే తీరు ఒకవైపుంచితే... ఇంటికి మధ్య భాగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగది ఉండకుండా చూడటం శ్రేయస్కరమని, టైనింగ్ టేబుల్‌ను కూడా శాస్త్ర ప్రకారం అమర్చుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఆ గృహంలో సకల సంపదలు చేరువవుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి