ఇంటి యజమాని ఫోటో ఎప్పుడూ రెడ్‌ఫ్రెమ్‌లో ఉంచి దక్షిణం వైపు ఉంచితే ఆ ఇంటి యజమానికి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సంఘంలో మంచి పలుకుబడి లభిస్తుంది. అలాగే మీ ఇంటి దక్షిణంవైపు ఎరుపురంగు ఫోటోలు వుంచితే మీ పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.
ఇంకా మీ ఇంట్లో పడమర ప్రాంతం ఎప్పుడూ పిల్లలు-సృజనాత్మకత అంశానికి సంబంధించిన ఫోటోలు తగిలించడం మంచిది. పడమర వైపు గోడమీద పిల్లల ఫోటోలు వుంచితే వారి అదృష్టాన్ని, శక్తిని పెంపొందించిన వారవుతారు. ఇంకా మీ ఇంట్లో రకరకాల ఫోటోలను ఫెంగ్‌షుయ్ తెలిపిన దిక్కుల్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలవు పొందవచ్చు.