ఫెంగ్‌షుయ్ ప్రకారం సంతాన ప్రాప్తి!

శుక్రవారం, 12 సెప్టెంబరు 2008 (18:40 IST)
ఎన్ని సంపదలున్నా.. సంతాన ప్రాప్తి లేదని కొందరు దంపతులు కుమిలిపోతుంటారు. అలాంటి వారు ఫెంగ్‌షుయ్ సూత్రాలను పాటించినట్లైతే సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ముందుగా దంపతులు శయనించే బెడ్‌కి ఎదురుగా ఏదైనా గోడమూలలు పొడుచుకొని వచ్చాయేమోనని గమనించాలి.

అలాగే ఇంటి ముఖద్వారాన్ని సైతం బయట నుండి ఏదైనా విషపు బాణాలు పొడుచుకునేటట్లు మొనలు ఉన్నాయోమోనని చూసుకోవాలి. ఇంటి ముఖ ద్వారానికి ముందు ఏదైనా చెట్టుకొమ్మ గానీ, లేదా షెట్టర్లు గానీ వాలీ ఉంటే వాటిని తీసేయడానికి ప్రయత్నించండి. వీలుకానట్లైతే వేరొక ఇంటికి మారండి.

ఇంకా... బెడ్‌రూంలో చిన్నపిల్లల బొమ్మలు గానీ, లేదా అందమైన పిల్లల పెయింటింగ్‌లను వేలాడదీయటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. మంచాలను దంపతులకు అచ్చొచ్చే సంఖ్యల ప్రకారం అమర్చుకోవడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి