సంపదకు ప్రతిరూపం నీరు

గురువారం, 11 సెప్టెంబరు 2008 (20:11 IST)
ఫెంగ్‌షుయ్ శాస్త్రం ప్రకారం సంపదకు ప్రతిరూపం నీరు. అందుకే గృహంలో వాడే ఫౌంటైన్‌లు, కాలువలు, అక్వేరియాల అమరికలో ప్రాధాన్యత వహించాలని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మీ టాయ్‌లెట్ ప్రధాన ద్వారం ఎదురుగా ఉండకూడదు. అలాగే బాత్‌రూమ్, బెడ్‌రూమ్‌కి, వంటగదికి ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి.

ఇంటికి బయట మురికి కాలువ ప్రవహించకూడదు. ఇంటి బయట ఉత్తరాన వాటర్ ట్యాంక్ కూడా ఉంచకూడదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అలాగే ప్రధాన ద్వారం కింద డ్రైనేజీ పైపు కూడా ఉంచకూడదు.

గృహంలో ఏ ప్రాంతంలో నీరు కారే విధంగా దూలాలు, పైకప్పులు ఉండకూడదు. ఇలా ఉంటే ఆ ఇంటి సంపద, ఆరోగ్యం హరిస్తుందని ఫెంగ్‌షుయ్ వెల్లడిస్తోంది. ఇకపోతే నీటిని చుక్కకూడా వృధాపోనీకుండా వాడుకోవడం ఉత్తమం. వాడని లేదా అవసరం లేని బావులు, గుంటలను పూడ్చివేయాలని ఫెంగ్‌షుయ్ అంటోంది.

వెబ్దునియా పై చదవండి