విశ్వకర్మ జయంతి 2022.. భార్యాభర్తలు కలిసి పూజ చేస్తే? (video)

శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (19:18 IST)
Vishwakarma
"ఇందులేడు అందుగలడను సందేహంబు వలదు 
సకల కళా వల్లభులైన విశ్వకర్మీయులు ఎందేందు చూసిన అందదే గలరు.." జై విశ్వకర్మ
 
విశ్వకర్మను పురాణాలు దేవతల శిల్పిగా, వాస్తుశిల్పిగా సూచిస్తుంటాయి. కనుక భవననిర్మాణ కార్మికులు, మేస్త్రీ లు, దేవాలయాలు నిర్మించేవారు, రాళ్ళతో, లోహాలతో శిల్పాలు చెక్కేవారు కూడా 'విశ్వకర్మ' కులానికి చెందినవారు కావచ్చు. విశ్వకర్మ భగవానుడి జయంతి ఏటా కన్యా సంక్రాంతి రోజున జరుపుకుంటారు. 
 
 
కన్యా సంక్రాంతి 2022లో సెప్టెంబర్ 17వ తేదీన వస్తోంది. రుగ్వేదంలో 12 ఆదిత్యులు మరియు లోకపాలకులతో పాటు విశ్వకర్మ దేవుడి గురించి కూడా ప్రస్తావించబడింది. విశ్వకర్మ జయంతి రోజున పూజ సమయంలో పనిముట్లు, నిర్మాణ పనులకు సంబంధించిన యంత్రాలు, కర్మాగారాలు, దుకాణాలు, మొదలైన వాటిని పూజిస్తారు. విశ్వకర్మను ఆరాధించడం ద్వారా జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు ఎప్పుడూ లోపించదని అంటారు. 
 
గ్రంథాలలో విశ్వకర్మ దేవుడిని బ్రహ్మ కుమారుడని రాయబడి ఉంది. అతను స్వర్గలోకం, పుష్పక విమానం, ద్వారకా నగరం, యమపురి, కుబేరపురి మొదలైన వాటిని నిర్మించారని గ్రంథాలు చెబుతున్నాయి. 
 
అంతేకాదు సత్యయుగ స్వర్గాన్ని, త్రేతయుగం లంకను, ద్వాపర యుగంలో ద్వారక నగరాలను నిర్మించాడని గ్రంథాలు చెబుతున్నాయి.  
 
విశ్వకర్మ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవాలి. కుటుంబంతో పూజను ప్రారంభించండి. భార్యా భర్తలు కలిసి పూజిస్తే ఇంకా మంచిది. పూజ చేసే చేతితో బియ్యం తీసుకుని విశ్వకర్మ దేవుడిని ధ్యానించండి అదే సమయంలో విశ్వకర్మ దేవుడికి తెల్లని పూలను సమర్పించాలి. 
 
దీని తర్వాత ధూప ధీప పుష్పాలతో స్వామివారిని పూజించండి ఆ తర్వాత మీ వద్ద కలిగి ఉన్న పనిముట్లు, యంత్రాలను ఇతర సాధనాలను విశ్వకర్మ భగవానుడి ముందుంచి పూజచేయాలిడి. చివరిగా విశ్వకర్మ భగవానుడికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు