ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు నుంచి యూకేలోని హెత్‌రో విమానాశ్రయానికి ఈ విమానాలు ప్రయాణిస్తాయి. మే 1 నుంచి 15 వరకూ ఇలా పాక్షిక సేవలు అందించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎయిరిండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది.
మరోవైపు, భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉధృతి కారణంగా ఇండియన్ ప్రయాణికులపై యూఏఈ నిషేధాన్ని పొడిగించింది. మే 14 వరకు భారత ప్రయాణికులకు యూఏఈలో ప్రవేశం లేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా తెలిసింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సమాచారం అందించింది.