ఈ ప్రైవేటు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ నుంచి వీడియోకాన్‌కు అక్రమంగా రూ.3,250 కోట్ల రుణం వెళ్లగా, అందుకు ప్రతిఫలంగా రూ.64 కోట్లను లంచంగా పొందారు. ఈ మొత్తాన్ని క్విడ్ ప్రోక్వో రూపంలో లబ్దిగా పొందారు. ఇలా లబ్ది పొందిందిన వ్యక్తి ఎవరో కాదు.. ఆ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ కావడం గమనార్హం. ఈ నిధులు కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ చేతికందినట్టు ప్రచారం సాగుతోంది.
వివిధ కంపెనీల ద్వారా క్విడ్ ప్రోక్వో జరిగిందని ఓ పరిశోధనాత్మక కథనం ఈ విషయాన్ని వెలుగులోకి తేగా, మొత్తం వ్యవహారం బ్యాంకింగ్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ, ఈడీ తదితర దర్యాఫ్తు సంస్థలు దృష్టిని సారించాయి. కాగా, ఇప్పటికే ఐసీఐసీఐకు భారత రిజర్వు బ్యాంకు భారీ మొత్తంలో పెనాల్టీ విధించిన విషయం తెల్సిందే.