పూజావిధానము: 1. శివాలయంలోని నవగ్రహముల మండలపములోని సూర్యుని విగ్రహము వద్ద ఉంగరము వుంచి సూర్య అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీల గోధుమలు ఎర్రని వస్త్రములో దానం చేయగలరు. 2. ఆదివారం రోజున ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపుగా శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయించగలరు. 3. బ్రాహ్మణునితో 6000 సార్లు సూర్యుని వేదమంత్రం జపము చేయించి ఉంగరమునకు ధారాదత్తం చేయగలరు. 4. కనీసం ధరించే వ్యక్తి సూర్యుని ధ్యాస శ్లోకము 70 మార్లు పారాయణ చేసి ధరించగలరు. 5. అరసవెల్లి, గొల్లలమామిడాడ, పెద్దాపురం క్షేత్రములలో సూర్యదేవాలయం దర్శించినప్పుడు ఉంగరమునకు పూజ చేయించగలరు.