చిత్త నక్షత్రం, నాలుగో పాదములో పుట్టిన జాతకులైతే..?

FILE
చిత్తనక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులకు రెండు సంవత్సరముల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. రెండు సంవత్సరముల నుంచి 20 సంవత్సరముల వరకు ఈ జాతకులకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్యవేలుకు ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

20 సం.లు నుంచి 36 సం.లు వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించగలరు. 36 సంవత్సరముల నుంచి 55 వరకు శని మహర్దశ కావున వెండిని మధ్య వేలుకు ధరించడం మంచిది. అలాగే 55 నుంచి 72 సంవత్సరముల వరకు ఈ జాతకులకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారముతో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు.

72-79 సం.ల వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించాలి. 79-99 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి