జాతిపచ్చను బంగారములో పొదిగించుకుని.. పచ్చిపాలతోగానీ, గంగాజలములో గానీ ఒక రోజంతా వుంచి శుద్ధి చేయాలి. "ఓం బుం బుధాయ నమః" అనే మంత్రమును 17వేల సార్లు పఠించి, కుడిచేతి చిటికెన వేలుకు ధరించాలి.
బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరమును ఉంచి శుద్ధి చేయించగలరు. బ్రాహ్మణుడితో 17వేల సార్లు బుధుని వేదమంత్రం జపము చేయించి ఉంగరమునకు ధారాదత్తం చేయాలి. శ్రీ మహావిష్ణువు క్షేత్రములు దర్శించినప్పుడు ఉంగరమునకు పూజ చేయించగలరు. కనీసం ధరించే వ్యక్తి బుధ ధ్యాన శ్లోకమును 170 సార్లు పారాయణ చేసి ధరించగలరు.
ధరించవలసిన సమయము: బుధవారం, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతీ పూర్వఫల్గుణీ నక్షత్రాల రోజున ధరించగలరు. దానం చేయవలసినవి: ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలము, పెసలు, అరటిఆకు. ధారణ ఫలితములు: విద్య, బుద్ధి, వ్యాపారాల్లో వృద్ధి, స్మరణశక్తి వృద్ది వంటి ఫలితాలుంటాయి.