పలు సమస్యల నివారణకు చాలా మంది నవరత్నాలతో ఉంగరాలు చేయించుకొని ధరిస్తూండటం మనం చూస్తుంటాం. నవరత్నాలంటే ఏవేవి ? ఏ ఏ అంశాలపై అవి ప్రభావం చూపుతుంటాయి ? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే ఆయా ప్రయోజనాలపై మనకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఆ రత్నాలు, అవి చేసే మేలు గురించి తెలుసుకుందాం.
కెంపు : మానసిక సమస్యలు, హృద్రోగం, కంటి వ్యాధులతో బాధపడేవారు, అధిక వ్యయం పేదరికంతో ఇక్కట్ల పాలవుతున్నవారు ఎరుపు రంగు కెంపు రత్నంతో ఉంగరం చేయించుకొని ఆదివారం రోజు ఉదయం పూట ధరించాలి.
ముత్యం: వివాహ వాంఛితులు, కళల్లో పురోగతి కోరేవారు, కుటుంబ సౌఖ్యాన్ని ఆశిస్తున్నవారు ముత్యం పొదిగిన ఉంగరాన్ని సోమవారంనాడు ధరించాలి.
పగడం: శతృపీడ నివారణ, రాజకీయాలు, వాణిజ్య రంగాల్లో పురోగతి, మధుమేహం వంటి దీర్ఘవ్యాధుల నుంచి ఉపశమనం కోసం పగడపు ఉంగరాన్ని ధరించాలి.
పచ్చ: స్థిర చిత్తం, విద్యలో అభివృద్ధి, వ్యాపార పురోభివృద్ధి, నరాల వ్యాధి నుంచి విముక్తికి బుధవారం రోజున పచ్చ రాయి ఉంగరాన్ని పెట్టుకోవాలి.
పుష్యరాగం: ఆథ్యాత్మిక వికాసం, సూక్ష్మ జ్ఞానం కోసం పుష్యరాగ ఉంగరం ధరించాలి. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారికీ ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.
వజ్రం: సంగీత కళలు, మంత్ర శాస్త్రంపై ఆసక్తి గలవారు వజ్రపుటుంగరాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. పాలనాపరమైన వ్యూహరచనలు చేసేవారు, ఇతరులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించేవారికీ వజ్రం ఉపకరిస్తుంది.
నీలం: దారిద్ర్య బాధతో సతమతమవుతున్న వారు నీల రత్నం గల ఉంగరాన్ని ధరించాలి. కీళ్లకు సంబంధించిన సమస్యలున్నవారు ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.