మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బెంగుళూరులోని విక్టోరియా లే ఔట్‌లో ఉన్న నివాస భవనం, అర్కావతి లే ఔట్‌లోని ఒక నివాసస్థలం, తుమకూరులోని ఇండస్ట్రియల్ భూమి, అనేకల్ తాలూకాలోని వ్యవసాయ భూమిని జప్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.34.12 కోట్లుగా ఉంటుందని ఈడీ అధికారులు వెల్లడించారు.
కాగా, దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ మార్చి తొలి వారంలో రన్యారావును బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్న విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె వద్ద నుంచి 14.7 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌పై సీఐడీ, డీఆర్ఐ అధికారుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెపై పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారం అక్రమ రవాణా కేసులో ఆమె చురుకైన పాత్ర పోషించినట్టు ఈడీ దర్యాప్తులో నిర్ధారణ అయింది.