పగడమును కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మంగళవారం, మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాల రోజున ప్రాతఃకాలము నుంచి 11 గంటల లోపు ధరించాలి. "ఓం అం అంగారకాయ నమః" అనే మంత్రాన్ని ఏడువేల సార్లు పఠించి తర్వాత ధరించాలి. పగడమును బంగారంలోను, వెండిలోనూ పొదిగించుకుని ధరించవచ్చు. భూత, ప్రేత బాధలు తొలగించడానికి పగడ ధారణ చేయవచ్చు. ఇంకా వ్యాపారాభివృద్ధికి పగడమును ధరించవచ్చును.
శివాలయంలోని నవగ్రహముల మండపములోని కుజుని విగ్రహము వద్ద ఉంగరము వుంచి కుజుని అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీలు కందులు ఎర్రని వస్త్రములో దానం చేయించగలరు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయించాలి.
బ్రాహ్మణుడితో ఏడు వేల సార్లు కుజుని వేదమంత్రం జపము చేయించి ఉంగరమునకు ధారాదత్తం చేయాలి. సుబ్రహ్మణ్య క్షేత్రములు దర్శించినప్పుడు ఉంగరమునకు పూజ చేయించగలరు. కనీసం ధరించే వ్యక్తి కుజ ధ్యాన శ్లోకము 70 సార్లు పారాయణ చేసి ధరించగలరు.