రత్నాలను ధరించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని నిపుణుల వాదన. జాతకుల రాశులను బట్టి రాశి నాథులకు అనుగుణంగా రత్నధారణ చేయడంతో సుఖసంతోషాలు చేరువవుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇక విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు పగడం, పుష్యరాగ రత్నాలను ధరించవచ్చు.
ఇకవిశాఖ నక్షత్రంలో పుట్టిన వారు వ్యవహారదక్షులుగాను, స్వలాభం, సంఘసేవాతత్పరత వంటివి వీరిలో కనిపిస్తాయి. నిదానంగా, నిగూఢంగా వ్యవహరిస్తారు. నాలుగోస్థానంలో రాహువు, పదింట కేతువు మిశ్రమ యోగకారకులగుటచే తరచు ప్రయాణం, ఇబ్బందులు, అనారోగ్యం, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాం ఉంది.
పిక్కలు, నడుము, కంఠానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించుట మంచిదని రత్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇటువంటి సమయాల్లో పగడం, పుష్యరాగ రత్నాలను ధరించడం ద్వారా సమస్యలనుంచి బయటపడే ఆస్కారం ఉందని వారు అంటున్నారు.