సింహ, కన్యాలగ్న జాతకులు పగడమును ధరించండి

మంగళవారం, 8 నవంబరు 2011 (11:53 IST)
FILE
సింహలగ్న జాతకులకు కుజుడు చతుర్ధాధిపతి, నవమాధిపతి కావున జాతక చక్రములో కేంద్రమున వున్నచో పగడమును వెండితో పొదిగించుకుని ధరించగలరు. అలాగే రవి లగ్నాధిపతి కావున జాతక చక్రములో కేంద్రములో వున్నచో కెంపును వెండిలో పొదిగించుకుని ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని రత్నాలశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇక గురువు పంచమ, అష్టమాధిపతి కావున జాతక చక్రములో కోణములో వున్నచో కనకపుష్యరాగమును బంగారముతో పొదిగించుకుని ధరించడం మంచిది. అయితే బుధుడు ద్వితీయ ఏకాదశాధిపతి. కేవలం ద్వితీయ, పంచమస్థానాలతో వున్నచో ధరించిన మంచిది. శని షష్ఠమ, సప్తమాధిపతి కావున నీలమును ధరించరాదు.

అలాగే కన్యా లగ్నములో జన్మించిన జాతకులకు శని పంచమ షష్ఠామాధిపతి కావడంతో జాతక చక్రములో కేంద్రమున వున్నచో నీలమును ధరించగలరు. అయితే గురువు చతుర్ధ సప్తమాధిపతి కావడం ద్వారా కనక పుష్య రాగమును ధరించకూడదు.

చంద్రుడు ఏకాదశాధిపతి అగుటవలన ముత్యమును ధరించరాదు. ఇక కుజుడు తృతీయ, అష్టమాధిపతి. రెండు పాపస్థానములు కావడంతో పగడమును ధరించకూడదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి