స్వాతి నక్షత్రం నాలుగో పాదములో పుట్టిన వారైతే..?

FILE
స్వాతినక్షత్రం నాలుగో పాదములో పుట్టిన జాతకులు నాలుగు సంవత్సరములు, ఆరు నెలల నుంచి గోమేధికమును మధ్యవేలుకు ధరించడం మంచిది. నాలుగు సంవత్సరముల ఆరు నెలల నుంచి 20 సంవత్సరముల ఆరు నెలల వరకు ఈ జాతకులకు గురు మహర్ధశ కావున కనకపుష్యరాగమును బంగారములో పొదిగించుకుని చూపుడు వేలుకు ధరించడం శుభప్రదం.

20 సంవత్సరముల ఆరునెలల నుంచి 30 సంవత్సరముల ఆరు నెలల వరకు ఈ జాతకులకు శని మహర్ధశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.

అలాగే 30 సంవత్సరములు, ఆరు నెలల నుండి 56 సం.లు ఆరు నెలల వరకు బుధ మహర్ధశ కావున పచ్చను బంగారములో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు. 56 సం.లు ఆరు నెలల వయస్సు నుండి 63 సంవత్సరములు ఆరు నెలల వరరు బుధ మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించవలెను.

63 సం.లు ఆరు నెలల వయస్సు నుండి 83 సం.లు 6 నెలల వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే 83 సం.లు 6 నెలల వయస్సు నుండి 89 సం.లు ఆరు నెలలు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి