ఒకటవ సంఖ్యవారి వివాహం- ఆర్థిక పరిస్థితి

బుధవారం, 13 ఫిబ్రవరి 2008 (12:19 IST)
వీరికి వివాహం కొంత ఆలస్యంగా జరుగగలదు. వీరి కుటుంబ జీవితం చాలా సుఖదాయకంగా ఉండగలదు. దంపతుల మధ్య అభిప్రాయ భేదములు తలయెత్తిన వెంటనే సమసిపోగలవు. వీరి భార్య వీరికన్నా కొంత అందం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒకటో సంఖ్యవారు 2,4,8,7వ సంఖ్యల వారిని వివాహం చేసుకున్నట్లయితే సుఖంగా ఉంటారు. వీరు తమ సంఖ్యకే చెందిన ఒకటో సంఖ్య వారిని వివాహం చేసుకోవటం అంత శుభం కాజాలదు. వీరి సంతానం మంచి యోగప్రదంగా ఉండగవదు. 25, 28, 30, 32వ సంవత్సరంలో వివాహం జరుగును. వివాహం అనంతరం వీరి జీవితంలో ఊహించలేని మార్పులు జరుగగలవు.

ఆర్థికంగా వీరి జీవితం చాలా సుఖదాయకంగా ఉంటుంది. 30- 35 సంవత్సరాల నుంచి వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అభివృద్ధి ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎదురైనా ధనం బాగుగా సమకూరగలదు. వీరు ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు కోసమై తాపత్రయపడగలరు. వస్తు, వాహన, గృహాదులు బాగుగా ఉండగలవు. వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగ, రాజకీయాలలో వీరు ప్రముఖ పాత్ర వహించగలరు. వీరు సంఘంలో మంచి ఉన్నత స్థితి పొందగలరు. పేదవారికి, విద్యార్థులకు దానం చేయు స్వభావం ఉండటం వల్ల వీరు సంపాదించిన ఆదాయంలో అధికంగా ఖర్చయిపోతుంది. వీరి మొండివైఖరి వల్ల అదృష్టంగా వచ్చినవాటిని జారవిడుచుకుంటారు. ఒక్కొక్కప్పుడు అధికమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తదుపరి చాలా ఆనందదాయకంగా ఉండగలదు.

ఆరోగ్య విషయంలో వీరికి అధికమైన జాగ్రత్త అవసరం. దృష్టి దోషం, ఉదర సంబంధిత అనారోగ్యం, డయాబెటిస్ మొదలైన వ్యాధులు అధికంగా రాగలవు. ఎరుపు, పసుపుపచ్చ, తెలుపు వర్ణములు కలిగిన దుస్తులు ధరించిన శుభం. ఉత్తరం, తూర్పు ముఖంగా ఉన్న ఇల్లు కాని, వ్యాపార సంస్థలుగాని శుభం కలుగచేస్తాయి. 1, 8 అదృష్ట సంఖ్యలు. బంగారు ఆభరణాలు ధరించిన శుభం. వీరికి అనుకూలమైన తేదీలు 1, 10, 28, 31, 4. అలాగే ఆది, బుధ, గురువారాలలో కలిసి వస్తాయి. అలాగే జాతి కెంపు ఉంగరము ధరించిన శుభం కలుగుతుంది.

ఒకటో సంఖ్యలో ప్రఖ్యాతి గాంచిన వారు ఎందరో జన్మించారు. వారిలో ఇందిరాగాంధీ, టిప్పుసుల్తాన్, ఛత్రపతి శివాజీ, అలెగ్జాండర్, ప్రఖ్యాత జ్యోతిష శాస్త్రవేత్త షిరో, అనిబిసెంట్, పి.వి.నరసింహరావు, యన్.టి.రామారావు వంటి వారేకాక ఇంకా అనేక మంది ప్రఖ్యాతి గాంచినవారు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి