కనక పుష్యరాగంను ధరించడం ఎలా..!?

శుక్రవారం, 29 జూన్ 2012 (17:08 IST)
FILE
పచ్చిపాలతోగానీ, గంగా జలములోగాని ఒక రోజు వుంచి "ఓం బృం బృహస్పతయే నమః" అనే మంత్రాన్ని 16వేల సార్లు పఠించాలి. గురువారం, గురుష్యమి, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల రోజున కనక పుష్యరాగంను ధరించాలి. కుడిచేతి చూపుడు వేలుకు ధరించాలి. కనక పుష్యరాగాన్ని ధరించడం ద్వారా బలము, బుద్ధి, ఆరోగ్యము, ఆయుష్షు, పుత్ర సంతానం కలుగుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

శివాలయములోని నవగ్రహముల మండపంలోని గురుని విగ్రహము వద్ద ఉంగరమును ఉంచి అష్టోత్తరము చేయించి 11/4 కేజీల శెనగలు పసుపు వస్త్రములో దానం చేయగలరు.

గురువారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయగలర. బ్రాహ్మణుడితో 16వేల సార్లు గురుని వేదమంత్రం జపము చేయించి ఉంగరమునకు ధారాదత్తం చేయగలరు.

దత్త, సాయి క్షేత్రాలను దర్శించినపుడు ఉంగరమునకు పూజ చేయించగలరు. కనీసం ధరించే వ్యక్తి గురు ధ్యాన శ్లోకము 160 సార్లు పారాయణ చేసి ధరించగలరు. శెనగలు, పసుపు, మామిడి పండు, పసుపు వస్త్రాలను దానం చేయాలి.

వెబ్దునియా పై చదవండి