రత్నధారణ విధానంలో పద్ధతులు అవసరమని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. జన్మ నక్షత్రాన్ని బట్టి.. అనగా అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు కేతువు అధిపతి అగుట వలన వైఢూర్యం... భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి శుక్రుడు నక్షత్ర అధిపతి అగుటవలన వజ్రమును ధరించాలి.
కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రముగా కలవారు కెంపును... రోహిణి, హస్త, శ్రవణం జన్మ నక్షత్రములుగా కలవారు ముత్యమును... మృగశిర, చిత్త, ధనిష్ట జన్మ నక్షత్రములు కలవారు పగడమును ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.
ఆరుద్ర, స్వాతి, శతభిషం జన్మ నక్షత్ర ములు కలవారు గోమేధికము... పునర్వసు, విశాఖ, పూర్వాబాధ్ర జన్మ నక్షత్రములు కలవారు కనక పుష్యరాగమును... పుష్యమి, అనూరాధ, ఉత్తరాబాధ్ర జన్మ నక్షత్రములు కలవారు నీలమును... ఆశ్లేష, జ్వేష్ట, రేవతి జన్మ నక్షత్రములు కలవారు పచ్చను ధరించడం శుభ ఫలితాలనిస్తుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.