తులా లగ్నములో జన్మించిన జాతకులు కెంపును ధరించకూడదు. ఈ జాతకులకు రవి ఏకాదశాధిపతి కావడం చేత కెంపును ధరించకూడదని రత్నాల శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే కుజుడు ద్వితీయ సప్తమాధిపతి కావడంతో పగడమును కూడా ధరించడం అంత మంచిది కాదని వారు అంటున్నారు. ఇదేవిధంగా గురువు తృతీయ, షష్ఠమాధిపతి రెండూ పాపస్థానములే కావడంతో కనకపుష్యరాగం ధరించకూడదు. వీటిని ధరించడం ద్వారా అశుభ ఫలితాలుంటాయని, కాబట్టి కెంపు, పగడము, కనకపుష్యరాగములను ధరించడం మంచిది కాదు.
అయితే తులాలగ్న జాతకులు వెండిలో నీలమును పొదిగించుకుని ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఇంకా బంగారంలో పచ్చ, వజ్రాన్ని పొదిగించుకుని ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.