తులారాశి జాతకులు వజ్రాన్ని ధరిస్తే శ్రేయస్కరం!

సోమవారం, 31 మార్చి 2014 (14:38 IST)
File
FILE
శాంత స్వభావం కలిగిన తులారాశి జాతకులు నవరత్నాలలో మేలిమిదైన వజ్రాన్ని ధరించడం శ్రేయస్కరమని రత్నాల శాస్త్రం చెబుతోంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో ఈ జాతకులు వాక్చాతుర్యత, ఆలోచనపరులుగా ఉంటారు.

ఇంగ్లీష్‌లో డైమండ్ అని పిలువబడే ఈ వజ్రరత్నాన్ని... తులారాశికి చెందిన జాతకులు ధరిస్తే శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయని రత్నాలశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అంతేగాకుండా తెలుపురంగులో ఉండే ఈ రత్నాన్ని ధరించడం ద్వారా ధనధాన్యములు సమృద్ధిగా లభిస్తాయి.

స్త్రీ, పురుషులు వజ్రాన్ని బంగారంతో పొదిగించి ధరిస్తే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. వజ్రరత్నంతో ఆడవాళ్లు నెక్లెస్, చెవిపోగులు చేయించుకుని ధరిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని రత్నాల శాస్త్రం చెబుతోంది.

ఎలా ధరించాలంటే..?
శుక్రవారం సూర్యోదయానికి ముందే ధరించడం ద్వారా శరీరబలం, ఆరోగ్యం చేకూరుతోంది. బంగారంతో మాత్రమే పొదిగించిన వజ్రరత్నాన్ని కుడిచేతి ఉంగరపు వ్రేలుకు ధరించడం మంచిది. ముందుగా పాలు లేదా గంగాజలముతో వజ్రాన్ని శుద్ధి చేయాలి. తర్వాత శుక్ర ధ్యాన శ్లోకమును 200 సార్లు ధ్యానించి ధరించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వజ్రాన్ని ఇలా కనుగొనవచ్చు...
అసలైన వజ్రం స్థిరముగా, కఠినంగా ఉంటుంది. నిజమైన వజ్రంపై చారలు ఉండవు. వజ్రాన్ని ఎండలో పెడితే ఇంద్రధనుస్సు కనబడుతుంది. అదేవిధంగా అసలైన వజ్రం కింద పడితే పగిలిపోతుంది.

వెబ్దునియా పై చదవండి