నవరత్న ధారణతో సకల ఐశ్వర్యాలు చేరువవుతాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. రత్నాల్లో 1. ముత్యము, 2. మాణిక్యము, 3. వజ్రము, 4. పచ్చపూస, 5. పగడము, 6. గోమేధికము, 7. వైఢూర్యము, 8. పుష్యరాగము, 9. ఇంద్రనీలము అనే తొమ్మిదింటిని నవరత్నాలుగా పేర్కొంటారని జోతిష్యులు పేర్కొంటున్నారు.
ఎటువంటి సందర్భాలలో నవరత్నాలు ధరించాలి?
1. కుటుంబ సమస్యలు, 2. వివాహం ఆలస్యం కావడం, 3. మనో వ్యాకులత, 4. రోగపీడ, 5. శత్రుభయం 6. రుణపీడ 7. ప్రమాదభీతి 8. ఆర్థిక సమస్యలు 9. శిక్షలు - సంబంధిత భయాలు 10. నిరుద్యోగ సమస్య 11. సంతానం లేక పోవడం 12. విద్యలో పరాజయం 13. మరణ భీతి 14. లిటిగేషన్లు 15. పనులకు ఆటంకాలు వంటి ఈ సమస్యల నుంచి బయట పడడానికి, అభివృద్ధి సాధించడానికి నవరత్నాలు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అయితే ఎవరు, ఎటువంటి సందర్భాలలో, ఏ రత్నాలను ధరించాలి.. అనే విషయంపై జ్యోతిష, రత్న శాస్త్రాలలో అనుభవజ్ఞులను సంప్రదించడం శుభప్రదమని వారు చెబుతున్నారు. నవగ్రహాల సంచార సమయానికి అనువుగా, రత్నాలను ధరించడం ద్వారా పలు సమస్యలను నివారించవచ్చు. అదే విధంగా జన్మరాశికి అనుగుణంగా మాత్రమే రత్నాలు ధరించాలని జోతిష్కులు అంటున్నారు.