నవరత్నాలు ధరించిన వెంటనే దానము చేయాల్సినవి!

శనివారం, 22 అక్టోబరు 2011 (15:34 IST)
FILE
కెంపు ధరించగానే రాగి పళ్లెం, కొబ్బరికాయ, బెల్లం, ఎర్రటి వస్త్రం దానం చేయాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. ముత్యము ధరించగానే బియ్యం, పంచదార, క్షీరము, ఎలక్కాయను దానం చేయాలి. పగడమును ధరిస్తే కందులు, ప్రమిదెలు , కందిపప్పు, ఎర్రటి వస్త్రం దానం చేయడంతో శుభం చేకూరుతుంది.

పచ్చ రత్నాన్ని ధరించగానే పచ్చ పెసెలు, పచ్చని ద్రాక్ష, ఆకు కూరలు, ఆకుపచ్చ వస్త్రం దానం చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి. కనక పుష్య రాగం ధరించగానే శెనగలు, దోసకాయ, అరటిపండ్లు, పసుపు వస్త్రం దానం చేయడం మంచిది. ఇక వజ్రాన్ని ధరించడం ద్వారా పటిక, వెండి, బొబ్బర్లు తెల్లని వస్త్రం దానం చేయండి.

నీల రత్నాన్ని ధరిస్తే.. నల్లనువ్వులు, నల్లని ద్రాక్ష, నల్లని వస్త్రం దానం చేయాలి. గోమేధికాన్ని ధరించగానే మినుములు, కాఫీ పొడి రంగు వస్త్రాన్ని దానం చేయడం మంచిది. వైడూర్యమును ధరించగానే ఉలవలు, రకరకాలైన రంగుల వస్త్రాలను దానం చేయవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి