నీరసము తగ్గాలంటే ముత్యము ధరించండి

గురువారం, 13 ఫిబ్రవరి 2014 (18:33 IST)
FILE
నవరత్నాల్లో నీలరత్నాన్ని ధరిస్తే మానసికక్షోభ తగ్గిపోతుంది. దారిద్రబాధ, చోరబాధ, అస్థిరత్వము వంటివి కూడా నీలరత్న ధారణచే తొలగిపోతాయి. అలాగే కెంపును ధరించడం ద్వారా అతిసారము, జ్వరము, అగ్నిరోగము, మనోవ్యసనములు దూరమవుతాయి. ఇంకా స్త్రీ సంబంధ వ్యాధి, పాండు, కామెర్లు, నీరసము తగ్గిపోవాలంటే ముత్యము ధరించాలి.

వ్రణములు, శస్త్రబాధ, మశూచి, శ్లేషకఫములు తగ్గిపోవాలంటే పగడాన్ని ధరించడం ఉత్తమం. ఉదర బాధ, కుష్టు, అగ్నిమాంద్యము, నొప్పులు, మర్మావయవబాధలు తొలగిపోవాలంటే జాతిపచ్చను ధరించడం చేయాలి.

దీర్ఘ శుక్లనష్టవ్యాధులు, కాళ్ళు మంటలు తగ్గిపోవాలంటే కనకపుష్యరాగాన్ని, మేహరోగము, మూత్ర రోగము, కామవికారములు వంటివి తగ్గిపోవాలంటే వజ్రము ధరించడం శ్రేయస్కరము.

ఇంకా దురద, శతృపీడ, నీచసాంగత్యము, రహస్య వ్యాధులు దూరం కావాలంటే వైఢూర్యమును, క్రిమిరోగము, పిచ్చిపిశాచముల బాధల నుంచి విముక్తి కలగాలంటే గోమేధికాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి