మేష, వృశ్చిక రాశుల అధిపతి కుజుడు. కాబట్టి కుజుని రత్నమైన పగడాన్ని మేష, వృశ్చిక రాశుల్లో జన్మించిన వారు ధరించవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అదే విధంగా మేష, వృశ్చిక లగ్నాలలో జన్మించిన వారు, మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలలో, 9, 18, 27 తేదీలలో పుట్టిన వారు, అంగారక దశ నడుస్తున్న వారు, దుష్ట స్థానాలలో, దుర్బల స్థానాలలో కుజ గ్రహం వుండగా జన్మించిన వారంతా పగడం ధరించవచ్చునని వారు పేర్కొంటున్నారు.
ఇక పగడాన్ని ధరించడం ద్వారా కలిగే ఫలితాలను పరిశీలిస్తే... కుజ దోష నివారణకు పగడాన్ని ధరించడం ఉత్తమం. అంతేకాకుండా ప్రధానంగా మహిళలు సౌభాగ్యం కోసం పగడాన్ని ధరిస్తారని జ్యోతిష్కులు అంటున్నారు.
రుణపీడ నివారణకు, శత్రుభయం, ధైర్యానికి, విజయానికి, ప్రమాదాల నివారణకు పగడం ధరిస్తారు. ఇకపోతే వివాదాల పరిష్కారం, రక్తశుద్ధికి, శిరోవ్యాధి నివారణ, సోదరుల మధ్య సఖ్యతకు పగడం ధారణ అనుకూలమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.