పుబ్బ నక్షత్రంలో జన్మించిన జాతకలు వజ్రాన్ని ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 15 సంవత్సరాల వరకు పుబ్బ నక్షత్ర జాతకులకు శుక్ర మహర్దశ కావడంతో వజ్రమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు.
15 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించడం మంచిది.
21-31 సంవత్సరాల వరకు ఈ జాతకులు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 31- 38సంవత్సరాల వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారంలో పొదిగించి ఉంగరపు వేలుకు ధరించగలరు.
38 సంవత్సరముల నుంచి 56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.
56 సంవత్సరముల 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారములో చూపుడు వేలుకు ధరించగలరు.
72 సంవత్సరముల నుండి 91 సంవత్సరముల వరకు శని మహర్దశ కావున నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.