భరణి ఒకటో పాద జన్మకారుల రత్నధారణ!

మంగళవారం, 26 ఆగస్టు 2008 (18:38 IST)
భరణి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారికి 20 సంవత్సరాలనుండి 26 సంవత్సరాల వరకు శుక్రమహర్దశ ప్రవేశించడంతో వజ్రానికి బంగారుతో చేసుకున్న ఉంగరాన్ని ఉంగరపు వ్రేలుకు ధరించినా మంచి ఫలితాన్నిస్తుందని రత్నాల నిపుణులు చెబుతున్నారు.

26 వయస్సు నుండి 36 వయస్సు వరకు చంద్ర మహర్దశలో సంచరించడంతో ముత్యాన్ని వెండితో పొదిగించి ఉంగరపు వ్రేలుకు ధరించాలని శాస్త్రకారులు తెలుపుతున్నారు.

36 సంవత్సరాలనుండి 43 సంవత్సరాల వరకు కుజ మహర్దశ ప్రభావం ఉండటంతో... పగడాన్ని బంగారులో పొదిగంచి వ్రేలుకు ధరించుకోవాలని రత్నాల శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. 43 నండి 61 ఏడ్లవరకు రాహు మహర్దశ సంచారం కారణంగా గోమేధికాన్ని వెండితో పొదిగి మధ్యవ్రేలుకు ధరించవచ్చునని శాస్త్రజ్ఞులు ప్రేర్కొన్నారు.
61 నుండి 72 వరకు గురు మహర్దశ జరగడంతో పుష్యరాగమును బంగారంలో పొదిగించి చూపుడు వ్రేలుకు ధరించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 72 సంవత్సరాల నుండి 96 ఏళ్ళ వరకు శని మహర్దశ ఉండటంతో... నీలమును వెండితో మధ్యవ్రేలుకు ధరించుకున్నట్లైతే మంచి ఫలితాల్నిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి