మఖ నక్షత్రం ఒకటో పాదములో పుట్టిన జాతకులైతే..!?

FILE
మఖ నక్షత్రం, ఒకటో పాదములో పుట్టిన జాతకులకు ఏడు సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండితో చిటికెన వ్రేలుకు ధరించగలరు. 7 సం.లు వయస్సు నుండి 21 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రమును బంగారముతో ఉంగరపు వ్రేలుకు ధరించగలరు.

21 సం.లు వయస్సు నుండి 33 సం.లు వరకు రవ మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 33 సం.లు వయస్సు నుండి 43 సం.లు వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండితో ఉంగరపు వ్రేలుకు ధరించడం శుభప్రదం.

43 సం.లు వయస్సు నుండి 50.సం.లు కుజ మహర్దశ కావున పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలుకు ధరించగలరు. 50 సం.లు వయస్సు నుండి 68 సం.లు వరకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండితో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించగలరు.

68 సం.లు వయస్సు నుండి 84 సం.లు వరకు గురు మహర్దశ కావున కనకపుష్యరాగమును బంగారంతో చూపుడు వ్రేలుకు ధరించడం మంచిదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి