మీన లగ్నములో జన్మించిన జాతకులకు చంద్రుడు పంచమాధిపతి కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ధరించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అలాగే కుజుడు ఈ జాతకులకు నవమాధిపతి కావున పగడమును వెండిలో పొదిగించుకుని కూడా ధరించవచ్చు. ఇంకా గురువు లగ్న దశమాధిపతి కావున కనకపుష్యరాగంను బంగారములో పొదిగించుకుని ధరించడం శుభ ఫలితాలనిస్తుంది.
అయితే ఈ లగ్నకారులకు బుధుడు చతుర్థ సప్తమాధిపతి కావున పచ్చను ధరించకూడదు. శని, ఏకాదశ, ద్వాదశాధిపతి కావున నీలమును కూడా ధరించకూడదు. శుక్రుడు తృతీయ అష్టమాధిపతి కావున వజ్రమును కూడా ధరించడం మంచిది కాదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.