మేషలగ్నంలో జన్మించిన జాతకులకు లగ్నాధిపతి కుజుడు కావున పగడమును ఉంగరపు వ్రేలుకు వెండితో పొదిగించుకుని ధరించగలరు. పంచమాధిపతి రవి కావున కెంపును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించవచ్చు. అలాగే భాగ్యాధిపతి అయిన గురువు కావున కనకపుష్యరాగంను చూపుడు వేలు ధరించడం శ్రేయస్కరం.
ఇక ధరించకూడనివి.. ఈ లగ్నము వారికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. ఇవి మారక స్థానములు కావున వజ్రమును ధరించరాదు. శని దశమ, ఏకాదశపతి అగును. ఏకాదశపతి అవటంతో నీలమును ధరించకూడదు. ఈ జాతకులకు బుధుడు తృతీయ షష్ఠమాధిపతి కావడంతో రెండు పాపస్థానములు అగుట వలన జాతిపచ్చను ధరించకూడదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.