రత్నాల శాస్త్రం ప్రకారం ముత్యాన్ని ఎలా ధరించాలి!?

గురువారం, 10 మే 2012 (17:16 IST)
FILE
ముత్యాన్ని పచ్చిపాలతో గానీ, గంగాజలముతో ఒకరోజంతా వుంచాలి. "ఓం చంద్రమసే నమః" అనే మంత్రాన్ని పదివేల సార్లు జపించి కుడిచేతి ఉంగరపు వేలుకు ధరించాలి. సోమవారం పౌర్ణమి రోజున, శ్రవణం, రోహిణి, హస్త నక్షత్రాల రోజున ధరించాలని రత్నాలశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పూజ ఎలా చేయాలంటే..!?
* శివాలయంలోని నవగ్రహాల మండపంలోని చంద్రుని విగ్రహము వద్ద ఉంగరమును ఉంచి చంద్ర అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీల బియ్యం తెల్లని వస్త్రములో దానం చేయగలరు.

* సోమవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల లోపుగా శివాలయం ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరమును ఉంచి శుద్ధి చేయించాలి. బ్రాహ్మణుడితో పదివేల సార్లు చంద్రవేద మంత్రం జపము చేయించి ఉంగరానికి ధారాదత్తం చేయాలి.

* గునుపూడి, కోటిపల్లి క్షేత్రములు దర్శించినప్పుడు ఉంగరమునకు పూజ చేయించడం మంచిది. కనీసం ధరించే వ్యక్తి చంద్ర ధ్యానశ్లోకము వందసార్లు పారాయణ చేసి ధరించడం ద్వారా మానసిక శాంతి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముత్యాన్ని ధరించేముందు పెరుగు, పాలు, వెండి, దూది, బియ్యం, నెయ్యిని దానం చేయాలి.

వెబ్దునియా పై చదవండి