రత్నాలకు శరీర అవయవాలకు లింకేమిటి?

ఆయురోగ్యాలతో ఉండేందుకు తమ స్థోమతకు తగినట్టుగా వివిధ రకాల రత్నాలను ధరించడం సహజం. అయితే, ఈ రత్నాల పుట్టుక పురాణాల ఆధారంగా జరిగినట్టు సమాచారం. అగ్నిపురాణము అనుసరించి దధీచి మహర్షి అస్తికలతో అస్త్ర నిర్మాణము జరిగిన తర్వాత చిన్న భాగము భూమిపై పడి నాలుగు ఖజానాల వజ్రాలు ఉత్పన్నమైనాయి.

అదేవిధంగా మరికొన్ని పురాణముల ప్రకారం మందర పర్వతము ద్వారా సముద్ర మథనము ద్వారా అమృతము పుట్టగా వానిలో కొన్ని బిందువులు భూమిపైపడగా అవి సూర్యకిరణముల ద్వారా ఎండి ఇసుక కణాలలో కలిసి భూమిపై విభిన్న రత్నాల ఉత్పన్నమైన్నట్టుగా చెపుతున్నారు.

అలాగే, గరుడపురాణము ప్రకారము వాతాసురడనే బ్రహ్మరాక్షసుడు వర ప్రభావం వల్ల దేవతలు అందరినీ ఓడించి స్వర్గమును ఆక్రమించెను. దేవతలు అందరు కలిసి వాతీసురుని తమ యాగపశువు రూపం ధరించమని ప్రార్థించగా అది మోసమని తెలిసి కూడా వారి కోరిక చెల్లించినాడు. ఆ వెంటనే దేవతలు పశువును వధించినారు. అతని శరీరపు వివిధ ముక్కలు భూమిపై పడుట అతని త్యాగనిరతి వల్ల సద్గుణాల వల్ల అతని శరీరములోని వివిధ భాగాలు రత్నాలకు జన్మస్థానమైనవి.

ఈ నవరత్నాలు శరీర అవయవాల ద్వారా పుట్టినట్టు ఈ పురాణాలు పేర్కొంటున్నాయి. ఇందులో కెంపు రత్నం రక్తముతో పుట్టింది. దీనివల్ల రక్త రోగనివారణ ఉపయోగం జరుగుతుందట. అలాగే, ముత్యము పళ్లతో పుట్టగా విరోచనాలను నివారిస్తుందట. పగడము ప్రేగులతో (జీర్ణలోప నివారణ), పచ్చ రత్నం పిత్తాశయముతో (చర్మరోగాలు నివారణ), పుష్యరాగము రత్నం పుట్టుమచ్చలతో (చర్మరోగాలు నివారణ), వైక్రాంతము గోరుతోనూ (గోరుదోషా నివారణ), వజ్రము ఎముకలతో (ఎముకల రోగ నివారణ), సూర్యకాంతమణి కోవ్వుతో (క్షయ నివారణ), గోమేధికము వీర్యముతో (ప్రేమ, వీర్యవికారము నివారణ), నీలము నేత్రములతో (నేత్ర రోగ నివారణ), వైఢ్యూర్యము గర్జనతో (స్వర పేటిక రోగ నివారణ) పుట్టినట్టు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి