వైడూర్యము ధరిస్తే ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. మంగళవారం, అశ్వని, మఖ, మూల నక్షత్రాల రోజున వైడూర్యమును ధరిస్తే భూతప్రేత పిశాచ బాధలు వుండవు. సంతానసుఖం, ధనవృద్ధి, శత్రు భయాలు నశిస్తాయని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
"ఓం ఐం హ్రీం కేతవే నమ:"ను ఏడువేల సార్లు పఠించి ఎడమచేతి చిటికెన వేలుకు ధరించగలరు. ధరించే ముందు ఉలవలు, ఖర్జూర ఫలములు, కొబ్బరికాయ, కంబళి, వస్త్రం, కస్తూరిని దానం చేయాలి.
1. శివాలయములోని నవగ్రహముల మండపములోని కేతు విగ్రహము వద్ద ఉంగరము వుంచి కేతు అష్టోత్తరము చేయించి 1 1/4 కేజీల ఉలవలు నల్లని వస్త్రములో దానం చేయగలరు.
2. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపుగా శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకములో ఉంగరము ఉంచి శుద్ధి చేయగలరు.
3. గణపతి క్షేత్రమును దర్శించినప్పుడు బ్రాహ్మణుడితో ఏడువేల సార్లు కేతు వేదమంత్రం జపము చేయించి ఉంగరానికి ధారాదత్తం చేయగలరు.
4. కనీసం ధరించే వ్యక్తి కేతు ధ్యాన శ్లోకము 70 మార్లు పారాయణ చేసి ధరించగలరు. బుధవారం ఆశ్లేష, మాఘ, మూల నక్షత్రం రోజున రవి పుష్యకాలంలో ధరించవచ్చును.