చాలా మంది వ్యక్తులకు గోళ్లు కొరుక్కునే అలవాటు ఉంటుంది. అలాగే, ఎలుకలు కూడా ప్రతి వస్తువునూ కొరుకుతుంటాయి. ఈ ఎలుకల బెడదతో ఇంట్లో ఇల్లాలు చిరాకుపడుతూ ఉంటుంది. నిజానికి కంటికి కనిపించిన ప్రతి వస్తువునూ ఎలుకలు ఎందుకు కొరుతాయన్న అంశాన్ని ఇక్కడ పరిశీలిద్ధాం.
మనిషికి గోళ్లు పెరుగుతున్నట్టుగానే ఎలుకలకు ముందు పళ్లు పెరుగుతూ ఉంటాయట. గోళ్లు పెరిగిన వెంటనే.. మనం కత్తిరించుకుంటాం. అదేవిధంగా ఎలుకలు కూడా ఇదే పని చేయాలి కదా. అందుకే. వాటికి ఆకలి ఉన్నా లేకపోయినా సరే కంటికి కనిపించిన ప్రతి వస్తువునూ కొరుకుతాయట. ఇలా చేయడం ద్వారా ఎలుక తమ ముందు పళ్లను అరగదీసుకుంటాయట.
ఎందుకంటే.. ఆ పళ్ళను కత్తిరించుకోలేవు కదా. ఎలుకలు ఏ ఒక్క వస్తువును కొరకకుండా ఉన్నట్టయితే, వాటి ముందు పళ్లు పొడవుగా పెరిగిపోవడం వల్ల నోరెళ్లబెట్టుకుని ఉంటాయని అందుకే పళ్లను అరగదీసుకునేందుకు సిమెంట్, ఇనుప వస్తువులతో పాటు.. గట్టి వస్తువులను కొరుకుతుంటాయని వాటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు.