జవాబులు కనుక్కోండి చూద్దాం..?!

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:51 IST)
ప్రశ్నలు :
1. కుటుంబాల ఏ స్థాయిని బట్టి దారిద్ర్య రేఖను నిర్ణయిస్తారు?
2. మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు ఎప్పటినుంచి అమలులోకి వచ్చాయి?
3. వేటి అమలు ద్వారా వ్యవసాయ రంగంలో అసమానతలు తగ్గుతాయి?
4. ఒక ఏడాది కాలంలో ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తయ్యే అంతిమ వస్తు సేవల సముదాయం ఏంటి?
5. జిల్లా పరిషత్తులో ఎక్స్ ఆఫీషియో మెంబర్‌గా వ్యవహరించేది ఎవరు?
6. ధరల స్థాయి పెరిగినప్పుడు వడ్డీరేటు ఏమవుతుంది?
7. రాజ్యాంగ సంబంధమైన కేసులను విచారించే కోర్టులు ఏవి?

జవాబులు :
1. వినియోగ వ్యయాల స్థాయి
2. 1951, ఏఫ్రిల్ 1వ తేదీ
3. భూ సంస్కరణలు
4. సేవల సముదాయం
5. జిల్లా కలెక్టర్
6. పెరుగుతుంది
7. హైకోర్టు, సుప్రీంకోర్టులు.

వెబ్దునియా పై చదవండి