భూగోళంపైన అతి లోతైన ప్రదేశం ఏది..?

పిల్లలూ.. మన భూగోళంపైన పర్వతాలు, మైదానాలు, పీఠభూముల్లాంటి... రకరకాల భూస్వరూపాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి వేరు వేరు భౌగోళిక స్వరూపాలు నేలపైనే కాకుండా, నీటిలోపల కూడా ఉన్నాయి. కాబట్టి.. మహాసముద్రాలలో కూడా కొండలు, కోనలు, పర్వతశ్రేణులు, మైదానాలు లాంటి వివిధ భూస్వరూపాలు నిక్షిప్తమై ఉన్నాయి.

అదలా ఉంచితే... ఫసిఫిక్ మహా సముద్రంలోని పల్లపు ప్రాంతాలలో ఒకటైన "మెరియానా ట్రెంచ్" చాలా లోతైనది. ఈ మహాసముద్రం పశ్చిమ భాగంలో, మెరియానా దీవులకు తూర్పు దిక్కున మరొక విశాలమైన పల్లపు ప్రాంతం ఉంది. ఇది ఎంత విశాలంగా ఉంటుందంటే, పొడవు 1554 మైళ్లు, వెడల్పు 44 మైళ్ళు.

సరిగ్గా ఈ పల్లపు ప్రాంతం నైరుతీ దిశ అగ్రభాగంలో ప్రపంచపు అతి లోతైన ప్రదేశం ఉంది. దీనినే "ఛాలెంజర్ డీప్" అని అంటారు. ఇదే మన భూగోళపు అతి లోతైన ప్రదేశం. ఇది సముద్ర ఉపరితలం నుంచి సుమారు 7 మైళ్ల లోతులో ఉంటుంది. అయితే, ఈ ఛాలెంజర్ డీప్ గురించి తెలుసుకున్న విషయాలు తాలా తక్కువేననీ, తెలియాల్సింది చాలా ఉందని పరిశోధకులు చెబుతున్నారు పిల్లలూ..!!

వెబ్దునియా పై చదవండి