మీకు ఇవి తెలుసా..?!

బుధవారం, 7 జనవరి 2009 (12:44 IST)
* పుట్టినప్పుడు మన కళ్లు ఏ సైజులో ఉంటాయో, చనిపోయేదాకా అవి అలాగే ఉంటాయి. చెవులు, ముక్కు మాత్రం పెరుగుతూనే ఉంటాయట.

* రెండు బిలియన్ల మందిలో ఒక్కరు మాత్రమే 116 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాకా జీవిస్తారు.

* పిల్లలు మోకాలి చిప్పలు లేకుండా పుడతారు. రెండు నుంచి ఆరు సంవత్సరాల వయసు నిండే లోపు వారికి మోకాలి చిప్పలు ఏర్పడతాయి.

* మనం కత్తిరించుకునేందుకు వాడుతున్న కత్తెరను.. లియోనార్డో డా విన్సీ కనుక్కొన్నాడు.

* ఇంగ్లీషు భాషలో పొడవైన పదానికి 1909 అక్షరాలుంటాయట...!

వెబ్దునియా పై చదవండి