శీతాకాలంలో నోట్లోంచి ఆవిరి ఎందుకొస్తుంది..?

FILE
పిల్లలూ..! శీతాకాలంలో అందరి నోళ్ల నుంచి తెల్లగా ఆవిరి వస్తుంటుంది కదా..! అలా ఎందుకొస్తుందంటే.. మనం పీల్చుకుని గాలిలో నీటి ఆవిరిని ధ్రువీకరించేందుకు తగినంత చల్లదనం సాధారణంగా శీతాకాలంలోనే ఉంటుంది. అందులోనూ తెల్లవారు ఝాము వేళల్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన నోట్లోంచి తెల్లగా ఆవిరి బయటకు వస్తుంటుంది.

అయితే ఒక్క శీతాకాలంలోనే కాదు.. మనం శ్వాస బయటికి విడిచినప్పుడల్లా, ఆ గాలితో పాటుగా నీటి ఆవిరి కొంత బయటకు పోతూనే ఉంటుంది. లోపలికి పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ వాయువును ఊపిరితిత్తుల్లోని రక్తంలోగల హిమోగ్లోబిన్ పీల్చుకుంటుంది. ఇక బయటికి వదిలే శ్వాసలో.. మన శరీరంలో తయారయ్యే కార్బన్ డై ఆక్సైడ్, తక్కువ స్థాయిలో నీటి ఆవిరి బయటికి వెళ్తుంటాయి.

అలా మనం ఊపిరి విడిచినప్పుడల్లా అందులోని కొంత నీరు ఆవిరి రూపంలో బయటికి వస్తూనే ఉంటుంది. అయితే అది మామూలు సమయాల్లో మాత్రం కనిపించదు. ఎందుకంటే నీటి ఆవిరి కంటికి కనిపించదు. అయితే నిజానికి మనకు తెల్లగా పొగలాగా కనిపించేది సూక్ష్మ రూపంలో ఉండే సన్నటి నీటి తుంపరలేగానీ... నీటి ఆవిరి మాత్రం కాదు.

మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే తక్కువ చల్లదనంగా ఉన్నట్లయితే.. మనం విడిచిన ఊపిరిలోని నీటి ఆవిరి చల్లబడి నీటి తుంపరలుగా ధ్రువీకరించి, అప్పుడు మన కంటికి కనిపిస్తుంటుంది. ఇలా మనకు ఎక్కువగా తెల్లవారుఝూమున కనిపిస్తుంటుంది. అదే ఎండ ఎక్కగానే వాతావరణం వెచ్చబడటం వల్ల... నీటి ఆవిరి, నీరుగా ధ్రువీకరించదు కాబట్టి మన కంటికి కనిపించదు.

వెబ్దునియా పై చదవండి