మరి..పండ్లపేరుతో ఓ కంపెనీ ఉంది తెలుసా. అదేంటంటే..డాక్టర్ అంకుల్ మనకు రోజూ ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యంగా వుంటామని చెబుతుంటారు కదా. ఆ యాపిల్ పేరుతోనే ఓ కంపెనీ పేరుంది తెలుసా, ఈ కంపెనీ కంప్యూటర్‌కు సంబంధించిన హార్డ్‌వేర్, సాఫ్టవేర్, ఇంకా ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తులకు మంచి పేరున్న కంపెనీ.
ఇంతే కాకుండా కంప్యూటర్‌కు సంబంధించిన అనేక వస్తువులను, అలాగే ఐ పాడ్‌లు, ఐ ఫోన్‌లు తయారు చేస్తుంది. అసలు ఈ కంపెనీకి యాపిల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ కంపెనీ యజమానికి యాపిల్ అంటే ఎంతో ఇష్టమట అందువలన తను స్థాపించే కంపెనీకి యాపిల్ పేరునే పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
కంపెనీకి మంచి పేరు పెట్టాలని ఎంత ఆలోచించినా అతనికి ఏ మాత్రం వేరే పేరేదీ స్ఫురణకు రాలేదంట. ఇలా మూడు నెలలు గడిచిపోయాయి. తన భాగస్వాములలో ఎవ్వరూ కూడా తనకు నచ్చిన పేరు సూచించకపోవడంతో యాపిల్ అనే పేరునే స్థిరంగా వుండడానికి తన కంపెనీకి ఆ పేరునే రిజిష్టర్ చేయించాడు. ఇంతకీ ఈ యాపిల్ కంపెనీ యజమాని పేరు ఏంటో తెలుసా..స్టీవ్ జాబ్.