చరిత్రలో ఈ రోజు- 04 ఆగస్టు 2021, World breastfeeding week 2021

బుధవారం, 4 ఆగస్టు 2021 (10:18 IST)
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మాహార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్ర. చరిత్ర అంటే అనేక సంఘటనల సమహారం...అనేక మార్పులకు ...ప్రగతికి..పోరాటాలకు.. పరిణామ క్రమానికి..మంచి చెడులకు సాక్ష్యం.. అలాంటి సంఘటనలెన్నో...మార్పులెన్నో మానవాళి పరిణామ క్రమంలో ఆ వివరాలు మీకోసం అందిస్తున్న సమాచారం..
 
ప్రత్యేక దినాలు
యు.ఎస్. కోస్ట్ గార్డ్ డే:
ఇది రెవెన్యూ మెరైన్ సృష్టిని గుర్తించడానికి జరుపుకుంటారు.1790 నుండి ఈ రోజును ట్రెజరీ కార్యదర్శి అలెగ్జాండర్ హామిల్టన్ ప్రారంభించినప్పటి నుండి దీనిని జరుపుకుంటున్నారు.
తల్లిపాల వారోత్సవాలు నాల్గవరోజు
[ఆంధ్రప్రదేశ్/తెలంగాణాలో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)]
 
సంఘటనలు
✴0181: ఆకాశంలోని, కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూసారు. సూపర్ నోవా అంటే ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ, ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ, పేలిపోయే నక్షత్రం) 
✴1693: డోమ్ పెరిగ్నాన్, షాంపేన్ అనే సారాయిని కనిపెట్టాడు. పాశ్చాత్య దేశాలలోని ఆడవాళ్ళు ఈ షాంపేన్ని ఎక్కువగా తాగుతారు.
✴1821: అత్కిన్సన్, అలెగ్జాండర్ అనే ఇద్దరు కలిసి, "సాటర్‌డే ఈవెనింగ్ పోస్ట్" అనే ఒక వారపత్రికను మొట్టమొదటిసారిగా ప్రచురించారు.
✴1824: కోస్ యుద్దం, టర్కీ దేశం, గ్రీసు దేశం మధ్య జరిగింది.
✴1830: చికాగో నగరం కోసం ప్రణాళికలు సిద్ధం చేసారు.
✴1884: థామస్ స్టీవెన్స్ సైకిల్ మీద అమెరికా అంతా చుట్టివచ్చిన మొదటి మనిషి. ఆ తరువాత, అతడు, సైకిల్ మీద ప్రపంచమంతా, చుట్టివచ్చాడు.
✴1906: ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో, సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభమైంది.
✴1914: మొదటి ప్రపంచ యుద్ధం : బెల్జియం దేశం మీద జర్మనీ దురాక్రమణ చేసింది. బదులుగా, బ్రిటన్, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.
✴1916: మొదటి ప్రపంచ యుద్ధం : లైబీరియా దేశం, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.
✴1925: అమెరికా నావికాబలగాలు 13-సంవత్సరాల ఆక్రమణ తరువాత నికారాగువా దేశాన్ని (నికరాగ్వా) వదిలేసి, వెళ్ళిపోయారు.
✴1927: అమెరికా, కెనడా ల మధ్య పీస్ బ్రిడ్జ్ (వంతెన) ప్రారంభమైంది.
✴1944: ఆమ్‌స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ (దినచర్య పుస్తకం) .
✴1947: జపాన్ సుప్రీం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) ఏర్పడింది.
✴1954: హఫీజ్ జలంధ్రీ రాసిన, అహ్మద్ జి. ఛగియ కంపోజ్ (కూర్చిన) చేసిన, ఖయుమి తరానా జాతీయగీతాన్ని, పాకిస్థాన్, "ప్రభుత్వ జాతీయ గీతం"గా ఆమోదించింది. 
✴1960: అమెరికాకు చెందిన వైమానికదళ పరిశోధక విమానం, గంటకి 2, 150 మైళ్ళ వేగంతో ప్రయాణించి, రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొపెల్లర్ తో కాకుండా, రాకెట్ ప్రొపెల్లర్ ఉపయోగించి, ఇంత వేగాన్ని సాధించింది.
✴1967: నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభించబడింది.
✴1971: అమెరికా మనుషులు ఉన్న అంతరిక్షనౌకనుంచి, మొదటి సారిగా ఒక ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది.
✴2009: తొలి స్వైన్ ఫ్లూ మరణం, మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది.
 
జననాలు
❇1719: జోహన్ గాట్లోబ్ లెమాన్, జర్మన్ ఖనిజ శాస్త్రవేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త (మ.1767)
❇1755: నికోలస్ జాక్వె కోంటె, "పెన్సిల్"ని కనిపెట్టిన శాస్త్రవేత్ (మ.1805).
❇1792: పెర్సీ షెల్లీ, ఆంగ్ల కవి (మ.1822)
❇1868: మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(మ.1922)
❇1900: క్వీన్ ఎలిజబెత్, బ్రిటిష్ రాణి తల్లి. 2000 సంవత్సరంలో బ్రిటిష్ రాణి తల్లి 100వ పుట్టినరోజు వేడుకలు బ్రిటన్ లో జరుపుకున్నారు (మ.2002).
❇1912: జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (మ.1992)
❇1926: మండలి వెంకట కృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (మ.1997).
❇1929 : ఈ రోజు గొప్ప హిందీ సినీ గాయకుడు కిషోర్ కుమార్ జన్మించాడు. (మ. 13 అక్టోబర్ 1987)
❇1948: శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
❇1954: ఉండవల్లి అరుణ కుమార్, భారత పార్లమెంటు సభ్యుడు.
❇1955: ఛార్లెస్ డి "సామ్" గెమర్ యాంక్టన్ ఎస్.డి, రోదసీ యాత్రికుడు ( రోదసీ నౌకలు ఎస్.టి.ఎస్. 38, 48)
❇1961: అమెరికా 44వ అధ్యక్షుడు (ప్రస్తుత అధ్యక్షుడు) బరాక్ ఒబామా, హవాయి ద్వీపం లో పుట్టాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు