విమాన ప్రయాణం చాలామందికి సరదా. గాల్లో తేలుతున్నట్లు, మబ్బుల పైన ప్రయాణించవచ్చని ఆ సరదా. గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చని కూడా ఎక్కువ మంది విమాన ప్రయాణాన్ని ఇష్టపడతారు. విమానాల వేగం ప్రధానంగా వాటి సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది.అయితే ఒక విమానం ఒకే దూరాన్ని ప్రయాణించడానికి పట్టే సమయం అన్నిసందర్భాల్లోనూ ఒకేరకంగా ఉండదు, హెచ్చుతగ్గులుంటాయి.
ఉత్తరార్థ గోళంలో గాలులు పడమర నుంచి తూర్పుకి వీస్తుంటాయి. ఈ గాలులు విమానాన్ని ముందుకు తోస్తాయి. తిరుగు ప్రయాణంలో అదే విమానం గమ్యం చేరడానికి అరగంట ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. గాలులు ఎదురు నుంచి వీయడమే అందుకు కారణం. ఒక విమానం.. న్యూయార్క్ నుంచి లండన్ వెళ్లడానికి పట్టే సమయం కంటే తిరుగు ప్రయాణానికి అరగంట ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది.