అన్ని క్షీరదాలకు చెందిన పాలు ఒకే రకంగా ఉండవట!!

సోమవారం, 17 అక్టోబరు 2011 (13:12 IST)
జంతువులలో క్షీరదాలు అనబడే జాతికి చెందినవి తమ సంతానానికి పాలిచ్చి పెంచుతాయి. ఇందుకోసం వాటి శరీరంలో క్షీరగ్రంథుల వంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. ప్రతి క్షీరదానికి చెందిన పాలు దాని బిడ్డలకు 'పరిపూర్ణమైన ఆహారం'గా ఉపయోగపడతాయి. అయితే అన్ని క్షీరదాలకు చెందిన పాలు ఒకే రకమైన ధర్మాలతో మాత్రం ఉండవు.

పాలలో నీరు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఇంకా చక్కెర(లు) తదితరం ఉంటాయి. అయితే ఈ అన్ని పదార్థాలు అన్ని రకాల క్షీరదాల పాలలోను ఒకే నిష్పత్తులో ఉండవు. అందువల్ల ఒక జంతువు పాలకు, మరో రకం జంతువు పాలకు మధ్య ఎంతో కొంత వ్యత్యాసం తప్పక ఉంటుంది.

మొత్తానికి కొన్ని జంతువుల పాలు పలుచగా ఉండి, సులభంగా జీర్ణమయ్యే విధంగా ఉంటాయి. ఉదాహరణకు గేదె పాల కన్నా ఆవుపాలు పలుచగా ఉండి, సులభంగా జీర్ణమవుతాయి. అందుకే తల్లి పాలు అందుబాటులో లేని (మనుషుల) శిశువులకు ఆవుపాలు బాగా ఉపయోగపడతాయి. మేక, గొర్రె, గాడిద, ఒంటె, లామా వంటి మరి కొన్ని జీవుల పాలను కూడా కొన్ని దేశాల్లోని మనుషులు తమ పిల్లలకు తాగిస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి